11-అక్టోబర్-2026
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి
మొదటి రోజు – శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి. దసరా మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు కార్యక్రమాలను శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి దివ్య అలంకరణతో భక్తిశ్రద్ధలతో ప్రారంభిస్తారు. తెల్లవారుజామున విశేష కుంకుమ పూజ నిర్వహించి, ఉత్సవ విగ్రహానికి 108 కలశాలతో అభిషేకం చేస్తారు. అనంతరం కలశ పూజ, గజారోహణ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించి, మహా మంగళహారతితో మొదటి రోజు కార్యక్రమాలను ముగిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పాల్గొని అమ్మవారి దివ్య దర్శనం మరియు ఆశీస్సులను పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.